సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం?

సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం?

సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం
ప్రజా క్షేత్ర్రం, వెబ్గా న్యూస్ :
చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో సింగర్ మంగ్లీ బర్త్ డే  పార్టీ జరిగింది. విదేశీ మద్యం, గంజాయి వినియోగం పై సమాచారం అందగానే పోలీసులు దాడులు జరిపారు. అక్కడ దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు.  మంగ్లీ అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. దాంతో  ఫోక్ సింగర్ మంగ్లీ పై కేసు నమోదు అయింది.  విదేశీ మద్యం అనుమతి లేకుండా  పార్టీ నిర్వహించడం పై కేసు నమోదు అయింది. దాంతో పాటు  త్రిపురా రిసార్ట్ జిఎం శివరామకృష్ణ పై కేసు నమోదు చేసారు.  అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డిజే సీజ్ చేసారు. పార్టీలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఈ ఉదంతం పై నా బర్త్ డే పార్టీ లో మద్యం లభించిన మాట వాస్తవమే. అయితే.. నాకు వాటికి అనుమతి తీసుకోవాలని  తెలియదు... ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి కూడా ఎక్కడో  సేవించి ఇక్కడికి వచ్చారని పోలీసులే తెలిపారని మంగ్లీ పేర్కొంది.